ఇంగ్లండ్‌లో మే ౩౦ నుంచి ప్రారంభం కానున్న క్రికెట్ ప్రపంచ
కప్‌నకు ముందు జరిగే ఐపీఎల్ 12వ సీజన్‌లో భారత్ జట్టుకు చెందిన ప్రధాన ఆటగాళ్లు పరిమిత
మ్యాచులు ఆడేలా చూడాలని ఫ్రాంచైజీలను ఒప్పిస్తానని ప్రధాన కోచ్ రవిశాస్త్రి తెలిపారు.
ప్రపంచ కప్‌లో కీలకంగా భావిస్తున్న బుమ్రా, షమీ, భువనేశ్వర్ కుమార్‌లకు తగినంత విశ్రాంతి
అవసరమని రవి పేర్కొన్నారు. ఆటగాళ్లు ఫాం కోల్పోకుండా కొన్ని మ్యాచుల్లో మాత్రమే ఆడే
విధంగా చూడాలని ఫ్రాంచైజీలతో పాటు టీం కెప్టెన్లకు కూడా సూచిస్తామని తెలిపారు. ప్రస్తుతం
న్యూజీలాండ్ పర్యటనలో ఉన్న భారత జట్టు స్వదేశానికి రాగానే ఇక్కడ ఆస్ట్రేలియాతో తలపడనుంది.
తర్వాత ఐపీఎల్ ప్రారంభమవుతుంది. అది పూర్తయిన పది రోజుల వ్యవధిలో ప్రపంచ కప్‌కు వెళ్లాలి.
కనుక ఆటగాళ్లు ఫిట్‌నెస్‌ను కాపాడుకోవాల్సి ఉంటుందని, అదే సమయంలో ఫాం కోల్పోకుండా జాగ్రత్త
పడాల్సి కూడా ఉంటుందనేది శాస్త్రి అభిప్రాయం