మాజీ మంత్రి నివాసాల్లో ఐటీ సోదాలు.. 20 చోట్ల త‌నిఖీలు

మాజీ మంత్రి నివాసాల్లో ఐటీ సోదాలు.. 20 చోట్ల త‌నిఖీలు

భువ‌నేశ్వ‌ర్‌: 2023లో హ‌త్య‌కు గురైన ఒడిశా మాజీ మంత్రి , సీనియ‌ర్ బీజేపీ నేత న‌బా కిశోర్ దాస్‌కు సంబంధించిన అక్ర‌మార్జ‌న కేసులో గురువారం ఆదాయం ప‌న్ను శాఖ అధికారులు త‌నిఖీలు నిర్వ‌హిస్తున్నారు. సుమారు 20 ప్ర‌దేశాల్లో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. తెల్లవారు జాము 5 గంట‌ల‌కు గాలింపు మొద‌లైంది. జార్సుగూడ‌, సంబ‌ల్‌పుర్‌, న్యూఢిల్లీల్లో ఉన్న దివంగ‌త మాజీ మంత్రి నివాసాల‌తో పాటు బంధువులు, అనుబంధ వ్యాపార‌వేత్త‌ల ఇండ్ల‌ల్లోనూ ఐటీ శాఖ త‌నిఖీలు నిర్వ‌హిస్తున్న‌ది. భువ‌నేశ్వ‌ర్‌లో ఉన్న మాజీ మంత్రి ఇళ్లు మాత్రం ప్ర‌స్తుతం మూసివేశారు. ఇంకా ఆయన సంబంధం ఉన్న హోట‌ల్,  ఇత‌ర ఆస్తులపై సోదాలు  జ‌రుగుతున్నాయి. పన్ను ఎగ‌వేత‌తో పాటు ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ప్ర‌స్తుతం త‌నిఖీలు జ‌రుగుతున్నాయి. మాజీ మంత్రి బొగ్గు, యాష్ ట్రాన్స్‌పోర్టేష‌న్ వ్యాపారాన్నిచేసే వారు.  సుమారు 180 మంది ఐటీ ఆఫీస‌ర్లు ఈసోదాల్లో పాల్గొన్నారు. సుమారు 40 మంది సీఆర్పీఎఫ్ సిబ్బంది, 60 వాహ‌నాలు, సైంటిఫిక్ అనాలిస్ బృందం కూడా వారితో ఉన్నాయి. కిశోర్ దాస్ కుమార్తె, జార్సుగూడ మాజీ ఎమ్మెల్యే దీపాలీ దాస్ ప్ర‌స్తుతం ఆచూకీ లేరు. ఆమె ఆఫీసు మూసి వేశారు.  గ‌తంలో దాస్ కుటుంబానికి ఐటీ నోటీసులు ఇచ్చినా వాళ్లు స‌రైన రిప్లై ఇవ్వలేదు. దీంతో ఈసారి ఐటీశాఖ భారీ స్థాయిలో దాడులు  మొద‌లుపెట్టింది. 2023 జ‌న‌వ‌రి 29వ తేదీన ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్న న‌బా కిశోర్ దాస్‌ను అసిస్టెంట్ స‌బ్ ఇన్‌స్పెక్ట‌ర్ త‌న రివాల్వ‌ర్‌తో కాల్చి చంపాడు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos