తగ్గనున్న బాస్మతి బియ్యం ధర

తగ్గనున్న బాస్మతి బియ్యం ధర

న్యూ ఢిల్లీ:బాస్మతి బియ్యం ధరలు త్వరలోనే తగ్గనున్నాయి. ఇజ్రాయెల్‌తో ఘర్షణలో ఉన్న ఇరాన్  ముందు ముందు  భారత్ నుంచి బాస్మతి బియ్యం దిగుమతిని తగ్గించే అవకాశం ఉంది. దీంతో మన దేశంలో  బాస్మతి బియ్యం ధరలు తగ్గుముఖం పట్టే ఛాన్స్ ఉందని అగ్రికల్చర్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్స్ ఎక్స్‌పోర్ట్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ-ఎపెడా వెల్లడించింది.భా రత్ నుంచి అత్యధికంగా బాస్మతి బియ్యాన్ని దిగుమతి చేసుకునే దేశాల్లో మూడో స్థానంలో ఇరాన్ ఉంది. తొలి రెండు స్థానాల్లో సౌదీ అరేబియా, ఇరాక్ ఉన్నాయి. 2024-2025 ఆర్థిక సంవత్సరంలో భారత్ నుంచి ఇరాన్‌కు రూ.6,374 కోట్లు విలువైన బాస్మతి  బియ్యం  ఎగుమతైంది.ఇది ఆ  ఏడాది  బాస్మతి బియ్యం ఎగుమతుల్లో  12.6 శాతం. “కేజీకి రూ.90 దాకా పలికిన భారత బాస్మతి బియ్యం ధర ఏప్రిల్ నెల మొదటి వారంలో రూ.75కు పడిపోయింది. తగినన్ని ఆర్డర్లు లేకపోవడం వల్లే రేటు అంతలా తగ్గింది. దీంతో ఈ ఏడాది ఏప్రిల్, మే నెలల్లో ఇరాన్, పశ్చిమాసియాల నుంచి భారీగా ఆర్డర్లు వచ్చాయి. దీంతో గత రెండు నెలల వ్యవధిలో భారత్ నుంచి పెద్దమొత్తంలో బాస్మతి బియ్యం విదేశాలకు ఎగుమతి అయింది. ఆ ప్రభావంతో బాస్మతి బియ్యం ధరలు 15 నుంచి 20 శాతం మేర పెరిగాయి” అని ఏపీఈడీఏ గుర్తుచేసింది. “రెండు నెలల క్రితం బాస్మతి బియ్యం ధరలు బాగా తగ్గాయి. టన్నుకు రూ.950 నుంచి రూ.1000 దాకా పలికిన బాస్మతి రేటు ఏకంగా రూ.900 నుంచి రూ.950కు డౌన్ అయింది. ఎగుమతి ఛార్జీలు పెరగడంతో ఈ ధరలో కొంతమేర దిద్దుబాటు జరిగింది” అని ఓ బాస్మతి బియ్యం ఎగుమతిదారుడు చెప్పుకొచ్చారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos