సోనియా గాంధీకి తీవ్ర అస్వస్థత

సోనియా గాంధీకి తీవ్ర అస్వస్థత

న్యూ ఢిల్లీ:కాంగ్రెస్‌ అగ్రనాయకురాలు సోనియా గాంధీ ఆదివారం ఢిల్లీలోని సర్‌ గంగారామ్‌ ఆస్పత్రిలో చేరారు. ఉదర సంబంధిత సమస్యలతో బాధపడుతూ ఇక్కడి గ్యాస్ట్రో విభాగంలో చేరినట్లు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం ఆమె వైద్యుల పరిశీలనలో ఉన్నట్లు తెలిపాయి. ఈ నెల 9న సోనియా ఇదే ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. దీనికి రెండు రోజుల ముందు శిమ్లాలోని ఇందిరాగాంధీ వైద్య కళాశాల ఆసుపత్రి (ఐజీఎంసీ)లో చేరిన విషయం తెలిసిందే. అధిక రక్తపోటుతో బాధపడుతున్న ఆమెకు వైద్యులు చికిత్స అందించారు.

 

 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos