టెహ్రాన్: ఇజ్రాయెల్ చేపట్టిన ఆపరేషన్ రైజింగ్ లయన్‌కు ప్రతిగా ఆపరేషన్ ట్రూ ప్రామిస్‌ను ఇరాన్ ప్రారంభించింది. టెల్ అవీవ్, జెరూసలేంపై క్షిపణుల వర్షం కురిపించింది. డజన్ల కొద్దీ బాలిస్టిక్ క్షిపణులతో దాడులు చేసింది. రెండు నగరాల్లో పలుచోట్ల జరిగిన బాంబు పేలుళ్లులో ఒకరు మరణించగా, సుమారు 34 మంది గాయపడ్డారు. ఇజ్రాయెల్‌లోని డజన్లకొద్దీ లక్ష్యాలపై దాడులు చేపట్టినట్లు ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ ప్రకటించింది. తమ పౌరులే లక్ష్యంగా టెహ్రాన్ దాడి చేపట్టినట్లు ఇజ్రాయెల్ పేర్కొంది. ప్రస్తుతం తమ పౌరులకు ముప్పు పొంచి ఉన్నట్లు తెలిపింది. ఇరాన్ మిస్సైళ్లను అడ్డుకునేందుకు ఇంటర్సెప్టార్ క్షిపణులను ప్రయోగించినట్లు ఐడీఎఫ్ వెల్లడించింది. అమెరికా సహకారంతో వాటిని సమర్థవంతంగా అడ్డుకుంటున్నట్లు ప్రకటించింది.ఇరాన్‌పై ఇజ్రాయెల్ శుక్రవారం తెల్లవారు జాము నాటి దాడుల తర్వాత 24 గంట్లలోపే మరోసారి క్షిపణులతో దాడి చేసింది. రాజధాని టెహ్రాన్ సహా పలు ప్రాంతాలపై బాంబుల వర్షం కురిపించింది. అణు, మిలిటరీ స్థావరాలతో సహా 200 లక్ష్యాలపై దాడులు నిర్వహించింది. ఇస్ఫహాన్ అణుకేంద్రపై దాడిచేసినట్లు ఇజ్రాయెల్ ఆర్మీ వెల్లడించింది. ఎయిర్‌ఫోర్స్ ఫైటర్ జెట్లతో లక్ష్యాలను ఛేదించినట్లు తెలిపింది. ఫోర్డూ అణుకేంద్రం సమీపంలో కూడా పెద్ద ఎత్తున పేలుళ్లు సంభవించాయి.