బడ్జెట్‌లో మా ఊసు ఏది.? గల్లా

బడ్జెట్‌లో మా ఊసు ఏది.? గల్లా

దిల్లీ: కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చిన హామీల ఊసే లేదని, రాష్ట్రాన్ని అస్సలు పట్టించుకోలేదని ఎంపీ గల్లా జయదేవ్‌ ధ్వజమెత్తారు. ఏపీకిచ్చిన హామీలు, నెరవేర్చిన వాటిపై వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. లోక్‌సభలో బడ్జెట్‌పై చర్చలో
పాల్గొన్న జయదేవ్‌ విమర్శలు గుప్పించారు.నోట్ల రద్దు, జీఎస్టీ వల్ల దేశంలో నిరుద్యోగం పెరిగిందని అన్నారు.  బడ్జెట్‌లో కచ్చితత్వం, జవాబుదారీతనం లోపించిందని ఎద్దేవాచేశారు. పునర్విభజన చట్టంలోని 29 అంశాల్లో ఏపీకి న్యాయం జరగలేదన్నారు. దిల్లీని మించి రాజధాని కడతామన్న , తిరుపతి, నెల్లూరు సభల్లో ఇచ్చిన హామీలను మోదీ విస్మరించారని విమర్శించారు.రైతులను ఆదుకుంటామంటూ చెప్పి రోజుకు రూ.17 ఇస్తూ చేతులు దులుపు న్నారని దుయ్యబట్టారు . ఈ నాలుగేళ్లలో ఏపీలో చంద్రబాబు రైతుల ఆదాయం రెట్టింపు చేశారన్నారు. రెండు కోట్ల మందికి ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి.. జీఎస్టీ, నోట్ల రద్దుతో ఉన్న ఉద్యోగాలను పోగొట్టారని అన్నారు. ఐదేళ్ల వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు చివరి బడ్జెట్‌లో ఏవో తాయిలాలు ప్రకటించారని విమర్శించారు. సమాఖ్య వ్యవస్థలో రాష్ట్రాలకు తగిన ప్రాధాన్యం ఇవ్వడం లేదని ఆరోపించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos