భారత క్రికెట్ జట్టు ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా జీవితంలోనే
అత్యంత కఠినమైన పరిస్థితులను ఎదుర్కొని, హీరోలా బయటపడి జట్టులో తిరిగి స్థానం సంపాదించాడని
జట్టు ప్రధాన కోచ్ రవిశాస్త్రి ప్రశంసించాడు. వివాదాలు చుట్టుముట్టినప్పటికీ ధైర్యంగా
ఎదుర్కొన్నాడని కితాబునిచ్చాడు. కాఫీ విత్ కరణ్ టీవీ టాక్ షోలో రాహుల్‌తో పాటు పాల్గొన్న
పాండ్యా పలు వివాదాస్పద విషయాలను బహిర్గత పరచిన సంగతి తెలిసిందే. దీంతో బీసీసీఐ అతనిపై
సస్పెన్ష్ వేటు వేసింది. టాక్ షో తర్వాత విమర్శకులు అతనిని మానసికంగా దెబ్బ తీసే
ప్రయత్నం చేసినా, పాండ్యా త్వరగా బయటపడి కోలుకున్నాడని కొనియాడాడు. తిరిగి జట్టులోనూ
స్థానం సంపాదించాడు. ఆ కసంతా మూడో వన్డేలో తీర్చుకున్నాడు. ఏదో ఒక సందర్భంలో అందరూ
తప్పులు చేస్తుంటారు. అదృష్టవశాత్తు పాండ్యా త్వరగా బయటపడ్డాడు. పాండ్యాను చూసి కోచ్‌గా
నేను గర్వపడుతున్నాను అని శాస్త్రి కొనియాడాడు.