న్యూ ఢిల్లీ: దేశంలో గత 24 గంటల్లో 300కిపైగా కరోనా కొత్త కేసులు వెలుగు చూశాయి. సోమవారం ఉదయం 8 గంటల నుంచి మంగళవారం ఉదయం 8 గంటల వరకూ 324 మందికి కొవిడ్ పాజిటివ్‌గా తేలింది. దేశంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 7 వేలకు చేరువైంది. అత్యధికంగా నిన్న ఒక్కరోజే కర్ణాటకలో 136 మందికి పాజిటివ్‌గా తేలింది. ఆ తర్వాత గుజరాత్‌లో 129 కేసులు వెలుగు చూశాయి. కేరళలో 96 మందికి పాజిటిగా తేలింది.