మోదీ ముఖంలో భయం:రాహుల్ గాంధీ

మోదీ ముఖంలో భయం:రాహుల్ గాంధీ

న్యూఢిల్లీ : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వణికిపోతున్నారని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఎద్దేవా చేశారు. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ మైనారిటీ విభాగాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీపై కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ విమర్శలు గుప్పించారు. యూపీయే మళ్ళీ అధికారంలోకి వస్తే ట్రిపుల్ తలాక్ బిల్లును ఉపసంహరిస్తామని చెప్పారు. మోదీని పరోక్షంగా ఉద్దేశించి రాహుల్ మాట్లాడుతూ 56 అంగుళాల ఛాతీ వణికిపోతోందన్నారు. ఈ దేశం అందరిదీనని చెప్పారు. రెండు సిద్ధాంతాల మధ్య పోరాటం జరుగుతోందన్నారు. “మోదీ ఇటీవల చాలా భయపడుతున్నారు. ఆయన చాలా నిరాశతో కనిపిస్తున్నారు. విద్వేషాన్ని వ్యాపింపజేయడం వల్ల మనుగడ ఉండదని , దేశంలోని ప్రజలను విభజిస్తూ పరిపాలన కొనసాగించలేమని తెలుసుకున్నారు. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించుతామని” రాహుల్ శపథం చేశారు. బీజేపీని ఎండగట్టడంలో కాంగ్రెస్ కార్యకర్తల కృషిని ప్రశంసించారు.” దేశంలోని వ్యవస్థలు ఏదో ఒక పార్టీకి చెందినవి కాదు.. అవి దేశానికి చెందినవి. వాటిని రక్షించడం మన బాధ్యత.. కాంగ్రెస్‌తో సహా అన్ని పార్టీల బాధ్యత ఇది. దేశం కన్నా తామే గొప్ప అని భాజపా భావిస్తోంది. తమ కంటే దేశమే గొప్ప అని మరో మూడు నెలల్లో వారికి తెలుస్తుంది’ అని వ్యాఖ్యానించారు. “దేశ భద్రత విషయంలో నాతో చర్చించేందుకు ప్రధాని మోదీని కనీసం 10 నిమిషాలు ఓ వేదికపై ఉంచండి. ఆయన అక్కడ ఉండలేక పారిపోతారు
ప్రధానమంత్రి ఓ ‘‘పిరికిపంద’’ అనీ… దమ్ముంటే జాతీయ భద్రత, రాఫెల్ ఒప్పందం, ఆర్ధిక వ్యవస్థ తదితర అంశాలపై చర్చకు రావాలంటూ సవాల్ విసిరారు. . డోక్లాంలోకి చైనా తమ బలగాల్ని పంపింది. మోదీ చైనా ముందు చేతులు కట్టుకుని నించున్నారు. ఈ ఐదేళ్లు ఆయనపై పోరాటం జరిపాక నాకు ఓ విషయం తెలిసింది. ఆయన ధైర్యం లేని వ్యక్తి. ఆయనతో వాదించడానికి ఎవరైనా ఆయన ముందు నిలబడితే అక్కడి నుంచి వెళ్లిపోతారు. మేము మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌ల్లో ఆర్‌ఎస్‌ఎస్‌ భావజాలాన్ని తొలగించి రాజ్యాంగబద్ధ వ్యవస్థలను నెలకొల్పుతున్నాం’ అని రాహుల్‌ గాంధీ వ్యాఖ్యానించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos