సస్పెండ్ అయిన పోలీసు ఇంట్లో భారీగా ఆయుధాలు

సస్పెండ్ అయిన పోలీసు ఇంట్లో భారీగా ఆయుధాలు

సమస్తిపూర్‌: అవినీతి ఆరోపణలతో సస్పెండ్ అయిన  ఇక్కడి ఏఎస్ఐ ఇంట్లో భారీగా ఆయుధాలు లభ్యమయ్యాయి.   ఏకే 47, ఏకే 56 తుపాకులు, డబుల్ బారెల్ గన్, మూడు నాటు ,500 తూటాలు,  బుల్లెట్ మ్యాగ్జిన్లు లభించటంతో సోదాకు వెళ్లిన పోలీసులు ఒక్కసారిగా అవాక్కయ్యారు. మొహియుద్దీన్ నగర్ పోలీస్ స్టేషన్​ పరిధిలో నివసించే ఏఎస్ఐ సరోజ్ సింగ్ అవినీతి ఆరోపణలతో ఏడాది క్రితం సస్పెండ్ అయ్యాడు. చట్టవిరుద్ధంగా ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసం చేయడం, నేరస్థులతో చేతులు కలిపి అక్రమంగా ఆయుధాలను రవాణా చేయడం వంటి ఆరోపణలు అతనిపై ఉన్నాయి. ఇద్దరు వ్యక్తుల హత్యకు సరోజ్ సింగ్​తో పాటు అతని అనుచరులు ముగ్గురు కుట్ర పన్నినట్లు పోలీసులకు సమాచారం అందింది. హత్యల కోసం ఆయుధాలను సమకూర్చుకున్నట్లు తెలిసింది., పటోరి మోహన్‌పూర్, మొహద్దినగర్, విద్యాపతి నగర్ పోలీస్ స్టేషన్‌లకు చెందిన పోలీసులుచ ప్రత్యేకకార్యచరణ జట్టు పోలీసులు సంయుక్తంగా దాడి చేసారు. పోలీసులను చూసిన సరోజ్ సింగ్ పారిపోయేందుకు ప్రయత్నించి, పోలీసులపై కాల్పులు కూడా జరిపారు. ఆ తర్వాత పోలీసులు సరోజ్ సింగ్ సహా నలుగురిని అరెస్టు చేసారు. అనంతరం సరోజ్ సింగ్ ఇంట్లో సోదాలను నిర్వహించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos