24 గంటల్లో 391 కొత్త కేసులు

24 గంటల్లో 391 కొత్త  కేసులు

న్యూ ఢిల్లీ: దేశంలో గత 24 గంటల్లో 391 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో యాక్టివ్‌ కేసుల సంఖ్య 5,755కు పెరిగింది. నిన్న ఒక్కరోజే నాలుగు మరణాలు కూడా నమోదయ్యాయి. శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి శనివారం ఉదయం 8 గంటల వరకూ 391 మందికి పాజిటివ్‌గా తేలింది. ప్రస్తుతం దేశంలో 5755 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇక ఇప్పటి వరకూ 5,484 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. అత్యధికంగా కేరళలో 1806 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. ఆ తర్వాత గుజరాత్‌లో 717, ఢిల్లీలో 665, పశ్చిమ బెంగాల్‌లో 622, మహారాష్ట్రలో 577, కర్ణాటకలో 444 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఏపీలో నిన్న ఒక్కరోజే 10 కేసులు, తెలంగాణలో నాలుగు కేసులు బయటపడ్డాయి. ప్రస్తుతం ఏపీలో 72, తెలంగాణలో 9 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos