బెంగళూరు: చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాటకు నైతిక బాధ్యత వహించి క్రికెట్ సంఘం కార్యదర్శి ఏ. శంకర్, ట్రెజరర్ ఇ.జైరాం తమ పదవులకు రాజీనామా సమర్పించారు. శుక్రవారం రాత్రి కర్ణాటక రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడికి తమ రాజీనామా పత్రాలకు పంపినట్లు వారు శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ‘గత రెండు రోజులుగా జరిగిన ఊహించని, దురదృష్టకర సంఘటనల కారణంగా మా పాత్ర చాలా పరిమితం అయినప్పటికీ.. నైతిక బాధ్యతగా రాజీనామా చేశాం. నిన్న కర్ణాటక రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడికి రాజీనామా లేఖ పంపాము’ అని వారు ఓ ప్రకటనలో వెల్లడించారు.