బెంగళూరు: చిన్నస్వామి స్టేడియం తొక్కిసలాట ఘటనపై జ్యూడిషియల్ విచారణ చేపడుతామని, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని కర్నాటక హోమంత్రి జి.పరమేశ్వర్ చెప్పారు. గురువారం స్టేడియాన్ని కర్నాటక హోమంత్రి జి.పరమేశ్వర్ సందర్శించిన తర్వాత మీడియాతో మాట్లాడారు. తమ ప్రభుత్వం విక్టరీ పరేడ్ ను నిర్వహించాలని ఆర్సీబీ జట్టు యాజమాన్యాన్ని కానీ, కర్నాటక క్రికెట్ అసోసియేషన్‌ను తమ ప్రభుత్వం కోరలేదని, యాదృచ్ఛికంగా బెంగళూర్ వచ్చిన సందర్భంగా జట్టుతో పాటు సభ్యులను సన్మానించామని స్పష్టం చేశారు. ఈ దుర్ఘటన తన మనస్సును కలిచివేసిందన్నారు. మేజిస్ట్రేజ్ విచారణకు సీఎం సిద్దరామయ్య ఆదేశించారని తెలిపారు. దీంతో విచారణ నివేదిక రాగానే బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు. ఆర్సీబీ విక్టరీ పరేడ్ లో తొక్కిసలాట జరిగి11మంది చనిపోగా, 50మంది గాయపడిన విషయం తెలిసిందే.