తిరుమల: కల్తీ నెయ్యి కేసులో టీటీడీ మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పీఏ అప్పన్నకు సిట్ నోటీసులు జారీ చేసింది. గత రెండు రోజులుగా ఆయనను అధికారులు పలు అంశాలపై ప్రశ్నిస్తున్నారు. అప్పన్నతో పాటు మరో ఆరుగురు ఉద్యోగులను సిట్ విచారిస్తోంది. తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడిన కేసులో ఇప్పటికే 15 మందిని అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అరెస్టైన వారిలో ముఖ్యంగా టీటీడీ కి నెయ్యి సరఫరా చేసిన డెయిరీ యజమానులు, ఉద్యోగులు ఉన్నారు.