4 వేలకు చేరువలో కొవిడ్‌ కేసులు

4 వేలకు చేరువలో కొవిడ్‌ కేసులు

న్యూ ఢిల్లీ: దేశంలో కరోనా వైరస్‌ కేసుల సంఖ్య నాలుగు వేలకు చేరువైంది. జూన్‌ 2 ఉదయం 8 గంటల సమయానికి దేశంలో యాక్టివ్‌ కేసుల సంఖ్య 3,961కి పెరిగింది. వీటిలో కేరళ రాష్ట్రంలో అత్యధికంగా 1435 కేసులు వెలుగు చూడగా.. మహారాష్ట్రలో 506, ఢిల్లీలో 483, గుజరాత్‌లో 338, పశ్చిమ బెంగాల్‌లో 331, కర్ణాటకలో 253 కేసులు వెలుగు చూశాయి. గత 24 గంటల్లో నాలుగు మరణాలు నమోదయ్యాయి. ఢిల్లీ, తమిళనాడు, కేరళ, మహారాష్ట్రలో ఒక్కొక్కరు చొప్పున వైరస్‌ కారణంగా మరణించారు. దీంతో ఈ ఏడాది ఇప్పటి వరకూ కొవిడ్‌ కారణంగా మరణించిన వారి సంఖ్య 32కి పెరిగింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos