తిరుపతిలో దారుణం.. డాక్టర్‌పై యాసిడ్‌ దాడి

  • In Crime
  • February 7, 2019
  • 188 Views
తిరుపతిలో దారుణం.. డాక్టర్‌పై యాసిడ్‌ దాడి

తిరుపతి పట్టణంలో యాసిడ్‌ దాడి జరిగింది. తిరుపతి కోర్టు హాల్‌లో గురువారం ఓ డాక్టర్‌పై మహిళ యాసిడ్‌తో దాడి చేసింది. డాక్టర్‌ అప్రమత్తంగా ఉండటంతో ఈ దాడి నుంచి తృటిలో తప్పించుకున్నారు. స్థానికంగా ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది.విడాకుల కేసు విచారణ నిమిత్తం ఆదర్శ్‌ రెడ్డి అనే డాక్టర్‌ గురువారం తిరుపతి కోర్టుకు హాజరయ్యారు. బురఖా ధరించి వచ్చిన ఓ మహిళ కోర్టు ప్రాంగణంలో అతడిపై యాసిడ్‌తో దాడికి యత్నించింది. అప్రమత్తంగా ఉన్న ఆదర్శ్‌ రెడ్డి.. ఈ దాడి నుంచి స్వల్ప గాయాలతో తప్పించుకున్నారు. దాడి అనంతరం తన వెంట తెచ్చుకున్న పురుగుల మందు తాగి ఆమె ఆత్మాహత్యాయత్నం చేసింది. దీంతో అక్కడే ఉన్న పోలీసులు ఆ మహిళను అదుపులోకి తీసుకున్నారు. చికిత్స నిమిత్తం రుయా ఆస్పత్రికి తరలించారు. దాడికి దిగిన మహిళ తిరుపతి నారాయణాద్రి ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తోంది.  తనను ప్రేమించి మోసం చేశాడని, అందుకే దాడి చేశానని సదరు మహిళ పోలీసులకు చెప్పినట్టు సమాచారం.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos