న్యూ ఢిల్లీ:‘ఆపరేషన్ సిందూర్’లో 100 మంది ఉగ్రవాదులు హతమైనట్లు కేంద్రం గురువారం ఇక్కడ ప్రకటించింది. అఖిలపక్ష స మావేశంలో రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్ మాట్లాడారు. పాకిస్థాన్, పీవోకేలోని ఉగ్రస్థావరాలపై ఆర్మీ చేపట్టిన దాడుల్లో 100 మంది మరణించినట్లు తెలిపారు. జమ్ము కశ్మీర్లోని పహల్గాంలో పర్యాటకులపై దాడికి పాల్పడి 26 మంది అమాయకుల ప్రాణాలు తీసిన ఉగ్రవాదులపై భారత్ ప్రతీకారం తీర్చుకున్న విషయం తెలిసిందే.