కర్నూలు: జిల్లా కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. 2017 మే 21న కృష్ణగిరి మండలంలో వైఎస్సార్సీపీ నేత చెరుకులపాడు నారాయణరెడ్డి హత్య కేసులో 11 మందికి జీవిత ఖైదుతో పాటు వెయ్యి చొప్పున జరిమానా విధించింది. ఐదుగురిని నిర్దోషులుగా ప్రకటించింది. ఈ కేసులో 29 మంది సాక్షులను కోర్టు విచారించింది.