సరిహద్దులో కాల్పులకు తెగబడ్డ పాక్​

సరిహద్దులో కాల్పులకు తెగబడ్డ పాక్​

న్యూ ఢిల్లీ:పాకిస్థాన్​లోని ఉగ్రస్థావరాలపై భారత్​ మెరుపు దాడుల తర్వాత దాయాది దేశం సరిహద్దులో కాల్పులకు దిగింది. ఎస్​ఓసీ వెంబడి ఉన్న గ్రామాలపై ఆర్టిలరీ, షెల్లింగ్​లతో దాడులు చేసింది. ఈ దాడుల్లో ఏడుగురు చనిపోయినట్లు అధికారులు తెలిపారు. ఇందులో ఒక మహిళ, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మరో 38మందికి గాయాలైనట్లు వెల్లడించారు. మృతులంతా పూంచ్​ జిల్లాకు చెందినవారని అధికారులు వెల్లడించారు. బారాముల్లా జిల్లాలోని ఉరి సెక్టార్​లో 10మంది గాయపడ్డారు. మరో ముగ్గురు రాజౌరీ జిల్లాలో క్షతగాత్రులయ్యారు. మంగళవారం అర్ధరాత్రి దాటాక ‘ఆపరేషన్‌ సిందూర్‌’ పేరుతో భారత్​- పాకిస్థాన్​లో టెర్రరిస్ట్ క్యాంపులపై మెరుపు దాడులు చేసింది. మొత్తం 9 ఉగ్రస్థావరాలపై భారత సైన్యం దాడులు చేపట్టింది. దీంతో సరిహద్దు నియంత్రణ రేఖ (ఎల్‌వోసీ) వెంట పాకిస్థాన్‌ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. విచక్షణారహితంగా కాల్పులు జరిపింది. అమాయక ప్రజలను పాకిస్థాన్​ బలిగొందని ఇండియన్ ఆర్మీ తెలిపింది. దీనికి బదులు తీర్చుకుంటామని చెప్పింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos