తిరుపతి:నగరంలో పోలీసులు మాట్రిక్స్ ఫోర్ థర్మల్ను డ్రోన్ల రాత్రి గస్తీ కోసం డ్రోన్ లు వినియోగిస్తున్నారు. ముఖ్యంగా రైల్వే ట్రాక్‌లు, నిర్మానుష్య ప్రాంతాలు, నగర శివార్లలో గంజాయి వినియోగం, పేకాట, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం వంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. అర్ధరాత్రి దాటిన తర్వాత అనవసరంగా రోడ్లపై తిరిగే వారిని, బైక్‌లతో విన్యాసాలు చేసే యువతను అదుపులోకి తీసుకుంటున్నారు.డ్రోన్ల వల్ల పోలీసుల సమయం, శ్రమ ఆదా అవుతోందని జిల్లా ఎస్పీ తెలిపారు. మరో ఐదు డ్రోన్లు శాంతి భద్రతల పర్యవేక్షణ, ట్రాఫిక్ నియంత్రణకూ ఉపయోగపడుతున్నాయని వివరించారు.