హిమాలయాల్లో మంచు కరిగిపోతోంది

హిమాలయా పర్వతాల్లో మూడింట రెండు వంతుల శాతం మంచు కరిగిపోబోతోందని ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఇంటెగ్రేటెడ్ మౌంటైన్ డెవలప్ మెంట్ సంస్థ (ఐసీఐఎండీ) తెలిపింది. తెల్లటి మంచుతో కప్పబడిన హిమగిరులు… మంచు కరిగిపోయి, రాతి కొండల్లా మిగిలిపోతాయని చెప్పింది. ఈ శతాబ్దం చివరి నాటికి ఇది జరగబోతోందని హెచ్చరించింది. మారుతున్న వాతావరణం, గ్రీన్ హౌస్ వాయువులు కారణమని చెప్పింది. వాతావరణ మార్పులను అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలను సక్రమంగా చేపట్టకపోతే పరిస్థితి మరితం దారుణంగా ఉంటుందని వెల్లడించింది.పెరుగుతున్న ఉష్ణోగ్రతల ప్రభావం ఆసియా ఖండంలోని ఆఫ్ఘనిస్థాన్, పాకిస్థాన్, ఇండియా, నేపాల్, చైనా, భూటాన్, బంగ్లాదేశ్, మయన్మార్ దేశాలపై తీవ్రంగా ఉంటుందని తెలిపింది.హిమాలయాల నుంచి స్వచ్ఛమైన నీరు 10 ప్రధానమైన నదుల ద్వారా ప్రవహించి 190 కోట్ల మంది ప్రజల అవసరాలను తీరుస్తోంది. హిమాలయాల్లోని మంచు కరిగిపోతే, నదులు ఎండి ఆహార కొరత ఏర్పడుతుందని హెచ్చరించింది. ఈ దేశాల్లోని 70 శాతం మంది ప్రజలు వ్యవసాయంపైనే ఆధారపడి ఉన్నారని. ఈ దేశాల్లో ఇప్పటికే ఆహార అభద్రత నెలకొందని తెలిపింది.హిమాలయాల్లో మంచు కరగడం వల్ల భారీ వరదలు లేదా తీవ్ర కరువు నెలకొనే అవకాశాలు ఉంటాయని వెల్లడించింది. , మారుతున్న పరిణామాలు దారుణంగా ఉన్నాయని . వాతావరణ పరిరక్షణకు సంబంధించి అత్యవసర చర్యలు అవసరమని ఐసీఐఎండీ చీఫ్ సైంటిస్ట్ ఫిలిప్పస్ వెస్టర్ అన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos