
ఢిల్లీ: బీజేపీ అంటే అగ్గిమీద గుగ్గిలమయ్యే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్.. తాజాగా ఓ వివరణ ఇచ్చారు. ఢిల్లీ ప్రభుత్వం, కేంద్రానికి మధ్య వివాదాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ, కేంద్ర ప్రభుత్వ వివాదంగా పేర్కొనడాన్ని తప్పు బట్టారు. సుప్రీం కోర్టులో తాము ప్రభుత్వం తరఫును పిటిషన్ వేశామని.. పార్టీ తరపున కాదని కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. ఒకవేళ ఆప్ వర్సెస్ కేంద్రంగా దాన్ని చూడాల్సి వస్తే… ఆప్ వర్సెస్ మోదీగా పేర్కొనాలని సూచించారు. ఢిల్లీ సీఎంగా అరవింద్ కేజ్రీవాల్ ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి కేంద్రంతో సంబంధాలు ఘర్షణపూరితంగానే ఉన్నాయి. ఈ విషయంలో సుప్రీం కోర్టుకు కూడా వెళ్లింది ఆప్ సర్కార్. ఈ ఘర్షణను కేంద్రం వర్సెస్ ఆప్‌గా చిత్రీకరిస్తూ మీడియా కథనాలు వెలువడేవి. దీన్ని ఉద్దేశించే కేజ్రీవాల్ తాజా ట్వీట్ చేశారు.