
దిల్లీ: సంక్షోభంలో ఉన్న జీ మీడియా గ్రూప్ మరో కీలక నిర్ణయం తీసుకొంది. ప్రముఖ ఇంగ్లిష్ పత్రిక డీఎన్‌ఏ మూసివేయాలని నిర్ణయించినట్లు ఒక ప్రముఖ ఆంగ్ల మీడియా సంస్థ వెల్లడించింది. కేవలం బ్యూరో మాత్రమే కొనసాగుతుందని పేర్కొంది. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి రానున్నట్లు సమాచారం. కేవలం ముంబయి ఎడిషన్‌పై మాత్రమే దృష్టి సారించనుంది.డెలిగెంట్ మీడియా కార్పొరేషన్ లిమిటెడ్‌లో డీఎన్‌ఏ పత్రిక ఒక భాగం. దీనిని 2005లో ఎస్సెల్ గ్రూప్, భాస్కర్ గ్రూప్‌లు సంయుక్తంగా ప్రారంభించాయి. 2012లో భాస్కర్ గ్రూప్ దీని నుంచి వైదొలగింది. దీంతో జీగ్రూప్‌నకు చెందిన ఎస్సెల్ గ్రూప్ దీని నిర్వహణను చూసుకుంటోంది. ఇప్పుడు ఆర్థిక ఇబ్బందుల్లో ఉండటంతో ఈ నిర్ణయం తీసుకొంది.