ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం ఉదయం ఫ్లాట్‌గా మొదలై లాభాల్లోకి మళ్లాయి. ఆర్‌బీఐ పరపతి విధాన సమీక్ష ప్రకటన వెలువడనున్న నేపథ్యంలో మదుపరులు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఉదయం 9.42గంటల సమయానికి సెన్సెక్స్ 131 పాయింట్ల లాభంతో 37,107 వద్ద, నిఫ్టీ 28 పాయింట్ల లాభంతో 11,091 వద్ద ట్రేడవుతున్నాయి. ఉదయం 11.45కు ఆర్‌బీఐ పరపతి విధాన సమీక్షపై ప్రకటన చేసే అవకాశం ఉంది. టాటామోటార్స్ షేర్లు 1శాతం లాభపడ్డాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 16పైసలు నష్టంతో రూ.71.72 వద్ద ట్రేడవుతోంది.నేడు దాదాపు 200 కంపెనీలు డిసెంబర్ త్రైమాసిక ఫలితాలను వెల్లడించనున్నాయి. వీటిల్లో బ్రిటానియా ఇండస్ట్రీస్, సుజ్లన్ ఎనర్జీ, టాటా మోటార్స్, సెయిల్, ఎంఆర్‌ఎఫ్,హెచ్‌సీసీ, కాడిల్లా హెల్త్‌కేర్, కాఫీడే, అదానీ ఎంటర్ ప్రైజెస్, అదానీ గ్రీన్ ఎనర్జీ వంటి దిగ్గజ సంస్థలు ఉన్నాయి.