కర్నూలులో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

  • In Crime
  • February 7, 2019
  • 967 Views

Road Accident In Kurnool District - Sakshi

కర్నూలు జిల్లా ఓర్వకల్లు దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా మరి కొంత మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరంతా కోడుమూరు నుంచి కడపకు  బయల్దేరగా ఓర్వకల్లు సమీపంలోకి రాగానే వీరి వాహనాన్ని లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వీరు ప్రయాణిస్తున్న వాహనం నుజ్జునుజ్జయింది. ప్రమాదం గురించి తెలియగానే స్థానికులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. స్థానికుల సహాయంతో పోలీసులు క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గురైన వారు రాజకీయ నేత కోట్ల హర్షవర్థన్ రెడ్డి వర్గీయులు. ఈ సమాచారం అందుకున్న కోట్ల ఘటనాస్థలికి చేరుకుని  పరిస్థితిని సమీక్షించారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుని క్షతగాత్రులను పరామర్శించారు. వారికి మెరుగైన చికిత్సనందించాలని వైద్యులను కోరారు. 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos