
ఆటో డ్రైవర్ నిజాయితీ చాటుకుని పలువురి ప్రశంసలు పొందాడు. శ్రీరాంనగర్‌కాలనీకి చెందిన కొత్తూరి కృష్ణ, ప్రసాద్ అన్నదములు. సిద్దిపేట నుంచి ఇంటి నిర్మాణం కోసం రూ.10లక్షలు బ్యాగులో తీసుకుని ఆటో ఎక్కారు. దిగేటప్పుడు బ్యాగును ఆటోలో మరిచిపోయి పోయారు. కొంతదూరం వెళ్లిన తర్వాత ఆటోడ్రైవర్ జె.రమేష్ బ్యాగు, అందులో డబ్బు ఉండడం గమనించి గచ్చిబౌలి పోలీసులకు అప్పగించాడు. పోలీసులు సమాచారం సేకరించి కృష్ణ, ప్రసాద్‌కు ఆటో డ్రైవర్ చేతులమీదుగా బ్యాగును అప్పగించారు. డీసీపీ వెంకటేశ్వరరావు, సిబ్బంది ఆటోడ్రైవర్ రమేష్‌ను అభినందించారు.