భారతీయ విద్యార్థి అరెస్ట్‌

భారతీయ విద్యార్థి అరెస్ట్‌

వాషింగ్టన్‌ డీసీ : పాలస్తీనా ఉగ్రవాద సంస్థ హమాస్‌తో సంబంధాలు  ఉన్నాయన్న ఆరోపణలపై ఓ భారతీయ విద్యార్థి ని అమెరికా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వాషింగ్టన్‌ డీసీ లోని జార్జ్‌టౌన్‌ విశ్వవిద్యాలయం లో పరిశోధకుడైన భారతీయ విద్యార్థి బదర్‌ ఖాన్‌ సూరి స్టూడెంట్‌ వీసాపై అమెరికాలో ఉంటున్నాడు. వర్సిటీలో అతడు హమాస్‌ ఉగ్రసంస్థకు మద్దతుగా ప్రచారం చేస్తున్నారని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ హోమ్‌ల్యాండ్‌ సెక్యూరిటీని ఊటంకిస్తూ ఫాక్స్‌ న్యూస్‌ నివేదించింది. ఈ మేరకు సోమవారం రాత్రి వర్జీనియాలోని అతని ఇంటి వెలుపల ఫెడరల్‌ ఏజెంట్లు అతన్ని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించింది. అతడి వీసాను కూడా రద్దు చేసినట్లు పేర్కొంది. అయితే, తన అరెస్ట్‌పై సూరి ఇమిగ్రేషన్ కోర్టులో సవాల్‌ చేశారు. తనకు ఎలాంటి నేర చరిత్ర లేదని, తన భార్యకు పాలస్తీనా మూలాలున్న కారణంగానే తనను లక్ష్యంగా చేసుకున్నారని కోర్టులో ఆయన పేర్కొన్నట్లు తెలిసింది.

 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos