పైకి వెల్లుల్లి.. లోపల పశుమాంసం..!

  • In Crime
  • February 7, 2019
  • 171 Views

బాలాపూర్‌ ఠాణా పరిధిలోని న్యూబాబానగర్‌లో బుధవారం  రాచకొండ పోలీసులు కట్టడి, ముట్టడి తనిఖీలు చేపట్టారు. ఎల్బీనగర్‌ డీసీపీ సన్‌ప్రీత్‌సింగ్‌, వనస్థలిపురం ఏసీపీ గాంధీనారాయణ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ తనిఖీల ప్రారంభంలోనే బస్తీలోకి అనుమానాస్పదంగా వస్తున్న ఓ డీసీఎం వాహనాన్ని గుర్తించి తనిఖీ చేశారు. వాహనంలోని లోడును పరిశీలించగా.. ముందు వెల్లుల్లిపాయలు బయటపడ్డాయి. ఇంత పెద్ద ఎత్తున వెల్లుల్లిని ఎక్కడికి తెస్తున్నారనే అనుమానంతో మరింత నిశితంగా పరిశీలించి.. వాహన సిబ్బందిని ప్రశ్నించగా.. వాహనంలో పశుమాంసం తరలిస్తున్నట్లు వెలుగు చూసింది. స్థానికంగా ఉండే ఓ కోల్డ్‌స్టోరేజ్‌కు గొడ్డు మాంసాన్ని తరలిస్తున్నట్లు వాహనంలోని వారు తెలిపారు. వెంటనే పోలీసులు డీసీఎం వాహనాన్ని స్వాధీనం చేసుకొని డ్రైవర్‌ను, మరో ఇద్దరిని అరెస్టు చేశారు. అనంతరం బాబానగర్‌లో ఇంటింటికీ వెళ్లి తనిఖీలు నిర్వహించారు. కిరాణా దుకాణాల్లో విక్రయిస్తున్న రూ.10వేల విలువైన నిషేధిత గుట్కా సంచులను స్వాధీనం చేసుకున్నారు. సరైన పత్రాలు లేని 13 ద్విచక్ర వాహనాలను, ఒర ఆటోను, నంబర్‌ ప్లేట్లు సరిగాలనేని మరో నాలుగు వాహనాలను సీజ్‌ చేశారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos