అమరావతి: పార్టీ నేతలతో చంద్రబాబు నిర్వహించిన టెలికాన్ఫరెన్సులో అన్న వస్తున్నాడంటూ వైసీపీ ప్రచారం ప్రస్తావనకు వచ్చింది. అన్న కాదు దున్న వస్తున్నాడనే భావన ప్రజల్లో ఉందని ఈ సందర్భంగా బాబుకు టీడీపీ నేతలు తెలిపారు. నేరస్తుడైన జగన్ను అన్నగా మహిళలు అంగీకరించని చంద్రబాబు అన్నారు. జగన్కు నేరస్తుడు ఎలా ఉండాలో తెలుసు గానీ..అన్నగా ఎలా ఉండాలో తెలుసా? అంటూ టెలికాన్ఫరెన్స్లో సీఎం వ్యాఖ్యానించారు.