జగన్ సభకి వెళ్తూ.. ముగ్గురు నేతలు ప్రమాదవశాత్తు కన్నుమూసిన సంఘటన కర్నూలు జిల్లా ఓర్వకల్లులో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఈ రోజు కడపలో సభ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే… ఈ సభలో ఇటీవల టీడీపీని వీడిన కోట్ల హర్షవర్దన్ రెడ్డి నేడు వైసీపీలో చేరాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఆయన తన అనుచరులు, సన్నిహితులతో కలిసి కడప కు బయలుదేరారు. వారు ప్రయాణిస్తున్న వాహనం ఓర్వకల్లు వద్ద ప్రమాదానికి గురైంది. కోట్ల అనుచరలు ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు.వారంతా… పోలీసులు సంఘటనాస్థలికి చేరుకొని కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.