ఢిల్లీ : కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రా నేడు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇ.డి) అధికారుల ఎదుట హాజరయ్యారు. వాద్రాతోపాటు ఆయన సతీమణి ప్రియాంకా గాంధీ కూడా ఉన్నారు. మనీ ల్యాండరింగ్ కేసులో వాద్రా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. విదేశాల్లో ఉన్న తన ఆస్తుల వివరాలను వాద్రా వివరించనున్నారు.