హైదరాబాద్: నగరంలోని శ్రీనగర్ కాలనీలో వర్ధమాన సీరియల్ నటి ఝాన్సీ ఆత్మహత్య చేసుకుంది. సాయి అపార్ట్‌మెంట్‌లోని తన నివాసంలో ఝాన్సీ ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఝాన్సీ ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణంగా తెలుస్తోంది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మా టీవీలో ప్రసారమయ్యే పవిత్రబంధం అనే సీరియల్‌లో ఝాన్సీ నటిస్తున్నారు.