ఢిల్లీలో భూకంపం.

ఢిల్లీలో భూకంపం.

ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో స్వల్ప భూకంపం  వచ్చింది. సోమవారం ఉదయం 5.36 గంటలకు ఢిల్లీతోపాటు సమీప ప్రాంతాల్లో భూమి కంపించింది. రిక్టర్‌ స్కేలుపై దీని తీవ్రత 4.0గా నమోదయింది. భూమిలోపల 5 కిలోమీటర్ల లోతులో కదలికలు సంభవించాయని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సీస్మోలజీ   తెలిపింది. తెల్లవారుజామునే భూకంపం రావడంతో ప్రజలు ఉలిక్కిపడ్డరు. ఇండ్ల నుంచి రోడ్లపైకి పరుగులు పెట్టారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos