అల్ల‌బ‌దియా ముంబై ఫ్లాట్ లాక్‌

అల్ల‌బ‌దియా ముంబై ఫ్లాట్ లాక్‌

ముంబై: వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేసిన యూట్యూబ‌ర్ ర‌ణ్‌వీర్ అల్ల‌బ‌దియా ప్ర‌స్తుతం ప‌రారీలో ఉన్న‌ట్లు తెలుస్తోంది. ముంబైలోని వెర్సోవా ప్రాంతంలో ఉన్న‌ అత‌ని ఫ్లాట్‌కు వెళ్లిన పోలీసులు అక్క‌డ ఎవ‌రూ లేన‌ట్లు గుర్తించారు. ఇటీవ‌ల ఓ యూట్యూబ్ షోలో.. పేరెంట్స్ సెక్స్ గురించి అత‌ను కామెంట్ చేసిన విష‌యం తెలిసిందే.ఆ కేసులో అత‌నికి అస్సాం పోలీసులు నోటీసులు జారీ చేశారు. అయితే శుక్ర‌వారం ముంబైలోని అత‌ని ఫ్లాట్‌కు పోలీసులు వెళ్లారు. అక్క‌డ అత‌ను లేన‌ట్లు గుర్తించారు. ఇంటికి లాక్ వేశారు.దీంతో మ‌ళ్లీ అత‌నికి నోటీసులు ఇచ్చారు. శుక్ర‌వారం విచార‌ణ‌కు హాజ‌రుకావాల‌ని ముంబై పోలీసులు తెలిపారు. బీర్‌బైసెప్స్ యూట్యూబ్ ఛాన‌ల్‌లో అల్ల‌బ‌దియా చాలా ఫేమ‌స్. ఓ షోలో కాంటెస్టెంట్‌ను జుగుప్సాక‌ర‌మైన ప్ర‌శ్న వేయ‌డంతో అత‌నిపై సోష‌ల్ మీడియాలో విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి. దీంతో ప‌లు ప్ర‌దేశాల్లో కేసులు కూడా న‌మోదు అయ్యాయి. వివాదాస్ప‌ద వ్యాఖ్య‌ల‌పై విచార‌ణ ఎదుర్కొనేందుకు అత‌న్ని ఖార్ పోలీసు స్టేష‌న్‌కు ర‌మ్మ‌న్నారు. అయితే అత‌ను రాక‌పోవ‌డంతో రెండోసారి స‌మ‌న్లు జారీ చేశారు. ఇంట్లోనే త‌న వాంగ్మూలం తీసుకోవాల‌ని తొలుత ఖార్ పోలీసుల్ని అల్ల‌బ‌దియా కోరాడు. కానీ అత‌ని విజ్ఞ‌ప్తిని పోలీసులు తిర‌స్క‌రించారు. యూట్యూబ‌ర్‌పై గౌహ‌తిలో కూడా పోలీసు కేసు న‌మోదు అయ్యింది. అల్ల‌బ‌దియాతో పాటు రైనా, ఆశిష్ చంచ‌లాని, జస్‌ప్ర్పీత్ సింగ్‌, అపూర్వ మ‌ఖీజాలు కూడా విచార‌ణ‌కు అందుబాటులో ఉండాల‌ని పోలీసులు ఆదేశాలు జారీ చేశారు.

 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos