పుల్వామా: ఇక్కడ జరిగిన ఉగ్రదాడి లో 40 మంది భారత జవాన్లు అమరులై నేటికి ఆరేండ్లు అయ్యింది. 2019 ఫిబ్రవరి 14వతేదీన జమ్ము కశ్మీర్లోని పుల్వామా ప్రాంతంలో సీఆర్పీఎఫ్ (రిజర్వ్ పోలీస్ ఫోర్స్) జవాన్లపై ఉగ్రవాదులు భీకర దాడికి తెగబడ్డారు. ఆ ఘటనలో 40 మంది సైనికులు అమరులైన విషయం తెలిసిందే.