ముంబై: బంగారం ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. బంగారు ఆభరణాలకు డిమాండ్ 80శాతం వరకు పడిపోయింది. ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ వర్గాల ప్రకారం పెళ్లిళ్ల సీజన్ కొనసాగుతున్నా బంగారు ఆభరణాల కొనేందుకు వినియోగదారులు ఆసక్తి చూపించడం లేదు. ఫలితంగా కొనుగోళ్లు మందగించాయి చైనా కొనుగోలుదారులను ఆకర్షించేందుకు డిస్కౌంట్ ఆఫర్స్ ప్రకటించారు.ట్రంప్ నేతృత్వంలోని యూఎస్ సుంకాలు విధిస్తున్నందున పెట్టుబడిదారులు బంగారం పెట్టుబడులకు ఆసక్తి చూపుతున్నారు. దీంతో పుత్తడి ధరలు ఆమాంతం పెరుగుతూ వస్తున్నాయి. రికార్డు స్థాయిలో ఔన్స్‌కు 2,942.70 డాలర్లకు చేరింది. పసిడిని కొనుగోలు చేసేందుకు సరైన సమయం ఎప్పుడో చెప్పాలని పలువురు అడుగుతున్నారని కోయంబత్తూరుకు చెందిన వ్యాపారి ముత్తువెంకట్రామ్ పేర్కొన్నారు. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ డేటా ప్రకారం.. 2024లో భారత దేశంలో బంగారం వినియోగం 563.4 మెట్రిక్ టన్నులుగా ఉంది. ఇది చైనా కంటే ఎక్కువ. చైనాలో 511.4 టన్నుల విక్రయాలు జరిగాయి. బంగారం ధరలు ఈ వారంలో పది గ్రాములకు రూ.88వేల గరిష్ఠానికి చేరాయి. 2024లో బంగారం ధరలు 21శాతం పెరిగాయి. ఈ ఏడాది కేవలం 45 రోజుల్లోనే బంగారం ధరలు 10శాతానికిపైగా పెరిగాయి. చైనీస్ న్యూ ఇయర్‌కు ముందు డిమాండ్‌ను చూశామని.. కానీ, ఇప్పుడు అధిక ధరల కారణంగా డిమాండ్ కనిపించడం లేదని ఓ చైనా వ్యాపారి పేర్కొన్నారు.