హైదరాబాదు:చిరంజీవి వ్యాఖ్యలపై శ్యామల స్పందిస్తూ.. వారసుడు కొడుకే అవుతాడా.? కూతుర్లు అవ్వలేరా.. నాకు ఈ వ్యాఖ్యలు అర్థం కాలేదు. చిరంజీగా ఏం ఉద్దేశ్యంతో అని ఉంటాడో తనకే తెలియాలి. వారసుడు కొడుకు మాత్రమే అవ్వాలి అనే ఆలోచన నుంచి చిరంజీవితో పాటు చాలామంది బయటకు వస్తే బాగుంటుంది. ఎందుకంటే ఈ జనరేషన్లో మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తుంటే కూడా ఇలాంటి వ్యాఖ్యలు సరికావు. చిరంజీవి ఇంట్లో అతడి కోడలు ఉపాసననే ఉంది. ఆమె తన బిజినెస్‌ని ఎంత చక్కగా రన్ చేస్తుంది. వారసులు అనేది కొడుకు మాత్రమే కాదు కూతురు కూడా అవ్వవచ్చు. ఈ విషయంలో ఇంతకంటే ఎక్కువగా మాట్లాడలేను అంటూ చెప్పుకోచ్చింది. ఏం జరిగిందంటే.. బ్రహ్మానందం, ఆయన తనయుడు రాజా గౌతమ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘బ్రహ్మా ఆనందం’. ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు ముఖ్య అతిథిగా వచ్చిన చిరంజీవి మాట్లాడుతూ.. తన వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లడానికి తనకు మనవడు కావాలని చిరంజీవి అన్నారు. నేను ఇంట్లో ఉన్నప్పుడు, నా మనవరాళ్లు నా చుట్టూ ఉన్నట్లు అనిపించదు. నేను లేడీస్ హాస్టల్ వార్డెన్ లాగా, చుట్టూ ఆడవాళ్ళతో ఉన్నట్లు అనిపిస్తుంది. చరణ్ ఇప్పటికైన ఒక అబ్బాయిని కను. నా వారసత్వం కొనసాగాలంటే మనువడు కావాలి. కానీ చరణ్‌కి మళ్లీ ఆడపిల్ల పుడుతుందేమో అని నాకు భయంగా ఉందంటూ చిరంజీవి చెప్పుకోచ్చాడు. అయితే చిరు చేసిన సెక్సిస్ట్ (లింగ సంబంధ) వ్యాఖ్యలు తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నాయి. 2025లో కూడా వారసుడు కావాలని కోరుకుంటున్నారు ఇలాంటి మనుషులు ఉన్న సమాజంలో మనం బ్రతుకుతున్నాం అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.