లఖ్ నవ్: కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కి ఇక్కడి కోర్టు సమన్లు జారీ చేసింది. వచ్చే నెల 24న కోర్టుకు హాజరు కావాలని ఆదేశించింది. 2022 డిసెంబర్లో భారత్ జోడో యాత్ర సందర్భంగా భారత సైన్యాన్ని అవమానించేలా రాహుల్ గాంధీ వ్యాఖ్యలు చేశారని ఆరోపణ.. ‘చైనా గురించి మీడియా నన్ను ఏమీ అడగదని నేను నా స్నేహితుడితో పందెం కాశాను. రెండు వేల చదరపు కిలోమీటర్ల భారత భూభాగాన్ని ఆక్రమించిన దేశం గురించి, మన సైనికులను చంపిన దేశం గురించి, అరుణాచల్ ప్రదేశ్లో మన సైనికులపై దాడులు చేస్తున్న దేశం గురించి ప్రెస్ నన్ను ప్రశ్నించదు. నేను చెప్పింది నిజమే. దేశం గమనిస్తోంది, వేరేలా ఆలోచించొద్దు’ అంటూ వ్యాఖ్యానించారు.