తిరుమల: కొండపై అన్యమత ప్రచారం, టీటీడీలో అన్యమత ఉద్యోగస్తుల విషయంలో చైర్మన్ బీఆర్ నాయుడు సీరియస్ గా స్పందించారు. టీటీడీ సంస్థలలో అన్యమత ఉద్యోగులపై బదిలీ వేటు వేశారు. టీటీడీ మహిళ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్, శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ అయుర్వేద కళాశాల ప్రిన్సిపాల్, టీటీడీ అనుబంధ విద్యాసంస్థల్లోని లెక్చరర్లు, వసతి గృహ వార్డెన్లు, తదితరులు మొత్తం 18 మందిని బదిలీ చేశారు. మరో 300 మంది అన్యమతస్తులు వివిధ విభాగాల్లో విధులు నిర్వర్తి స్తున్నట్లుగా సమాచారం.