న్యూ ఢిల్లీ: షెడ్యూల్ కులాలు, తెగలకు చెందిన మహిళలకు ఎస్సీ, ఎస్టీ మహిళల కోసం టర్మ్ లోన్ పథకాన్ని అమలు చేయనున్నట్లు ఆర్థిక మంత్రినిర్మల సీతారామన్ శనివారం బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించారు. ఈ పథకం కింద వచ్చే ఐదేళ్లలో రూ. 2కోట్ల వరకు రుణాలు 5 లక్షల మందికి అందిస్తామన్నారు. తొలిసారి సొంత వ్యాపారాలను ప్రారంభించే, ఉన్న వ్యాపారాలను విస్తరించాలనుకునే మహిళలకు ఈ పథకం ఉపయోగపడుతుంది.