శ్రీవారి దర్శన నకిలీ టికెట్లు పట్టివేత

శ్రీవారి దర్శన నకిలీ టికెట్లు పట్టివేత

తిరుమల : తిరుమలలో శుక్రవారం నకిలీ టికెట్లతో వచ్చిన భక్తులను విజిలెన్స్‌ అధికారులు పట్టుకున్నారు. హైదరాబాద్‌కు చెందిన నళినికాంత్‌ సహ మరో ఇద్దరు భక్తులు వైకుంఠం క్యూలైన్లో దర్శనానికి రాగా వారి టికెట్‌ స్కాన్‌ కాకపోవడంతో సిబ్బంది వెనక్కి పంపారు. వారు విజిలెన్స్‌ అధికారులకు ఫిర్యాదు చేయడంతో విచారణ ప్రారంభించారు. సతీష్‌ అనే దళారీ రూ. 10 లక్షల దాతల నకిలీ టికెట్లను ముగ్గురు భక్తులకు ఇచ్చి వారి వద్ద రూ. 2,100 వసూలు చేసి నకిలీ ఇచ్చినట్లు విజిలెన్స్‌ అధికారులు గుర్తించారు. భక్తుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos