ప్రశాంత్ కిషోర్‌ దీక్ష భగ్నం

ప్రశాంత్ కిషోర్‌ దీక్ష భగ్నం

పాట్నా: పేపర్ లీక్ అయిందన్న ఆరోపణల నేపథ్యంలో 70వ బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (బిపిఎస్‌సి) కంబైన్డ్ (ప్రిలిమినరీ) పోటీ పరీక్ష (సిసిఇ)ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న జన్ సూరాజ్ పార్టీ నాయకుడు ప్రశాంత్ కిషోర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గాంధీ మైదాన్‌లో నిషిద్ధ మండలంలో కూర్చున్నందున ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయాలని పోలీసులు గతంలోనే కిషోర్‌ను హెచ్చరించారు. పాట్నా హైకోర్టు ఆదేశాల ప్రకారం.. గర్దానీ బాగ్‌లోని నిర్దేశిత స్థలంలో కాకుండా వేరే ప్రదేశంలో ధర్నాను అనుమతించకూడదని తేల్చి చెప్పింది. కానీ, ప్రశాంత్ కిషోర్ గాంధీ మైదాన్ లో నిరసనకు దిగడంతో అరెస్ట్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో సోమవారం  తెల్లవారుజామున  4 గంటలకు పాట్నా పోలీసులు దీక్షను భగ్నం చేశారు. డిసెంబరు 29న పాట్నాలో విద్యార్థులపై లాఠీచార్జికి బాధ్యులైన అధికారులపై చర్యలు, బాధ్యులపై చర్యలు తీసుకోవడంతోపాటు గత 10 ఏళ్లలో పోటీ పరీక్షల్లో జరిగిన అవకతవకలు, పేపర్ లీకేజీలపై శ్వేతపత్రం విడుదల చేయాలని ఇతర డిమాండ్‌లు ఉన్నాయి. ఐదు ప్రధాన డిమాండ్లను అందజేస్తూ జనవరి 2 నుంచి ప్రశాంత్ కిషోర్ నిరాహార దీక్ష చేపట్టారు.

 

 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos