వంద‌కుపైగా విమానాలు ఆల‌స్యం

వంద‌కుపైగా విమానాలు ఆల‌స్యం

న్యూఢిల్లీ: ఢిల్లీ విమానాశ్ర‌యంలో ఇవాళ ఉద‌యం వంద‌కుపైగా విమానాలు ఆల‌స్యం అయ్యాయి. వెద‌ర్ స‌రిగా లేని కార‌ణంగా… విమానాల‌న్నీ ఆల‌స్యంగా ప్ర‌యాణిస్తున్నాయి. ఫ్ల‌యిట్ షెడ్యూల్‌ను స‌రిచూసుకోవాల‌ని ప్ర‌యాణికుల‌కు ఎయిర్‌లైన్స్ సంస్థ‌లు సూచించాయి. ఒక‌వేళ విజిబులిటీ మ‌రీ అద్వానంగా ఉంటే, అప్పుడు విమానాల‌ను ర‌ద్దు చేసే అవ‌కాశాలు ఉన్న‌ట్లు విమాన‌యాన సంస్థ‌లు చెబుతున్నాయి. ఢిల్లీలో ఇవాళ ఉద‌యం తీవ్ర స్థాయిలో మంచు దుప్ప‌టేసింది. విమానాలు ఆల‌స్యం అయినా.. వేటిని కూడా దారి మ‌ళ్లించ‌లేద‌న్నారు. విమాన ప్ర‌యాణికుల కోసం ఢిల్లీ ఇంట‌ర్నేష‌న‌ల్ ఎయిర్‌పోర్టు త‌న ట్వీట్‌లో ఓ పోస్టు చేసింది. అతి త‌క్కువ విజిబులిటీ ఉన్న స‌మ‌యంలో క్యాట్ త్రీ సౌక‌ర్యాల‌ను వినియోగిస్తుంటారు. ప్ర‌తి రోజు ఇందిరా గాంధీ విమానాశ్ర‌యంలో దాదాపు 1300 విమానాల‌ను ఆప‌రేట్ చేస్తుంటారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos