వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ ఈ నెల చివర్లో మరోసారి భేటీ కానున్నారు. వియత్నాం రాజధాని హనోయి లేదా డా నాంగ్ నగరాల్లో ఈ నెల 27, 28 తేదీల్లో ఈ సమావేశం జరగనున్నట్లు ట్రంప్ బుధవారం వెల్లడించారు. నిరుడు. సింగపూర్‌లో వీరు తొలిసారి భేటీ అయిన విషయం తెలిసిందే. కొరియా ద్వీపకల్పంలో శాంతిని నెలకొల్పే దిశగా తమ ప్రభుత్వం ముందడుగు వేసిందని స్పష్టం చేశారు. రెండో స్టేట్ ఆఫ్ ద యూనియన్ ప్రసంగంలో భాగంగా కాంగ్రెస్‌ను ఉద్దేశించి ట్రంప్ మాట్లాడారు. ఇంకా చాలా పని మిగిలే ఉన్నా.. ఉత్తర కొరియా నేత కిమ్‌తో తనకు మంచి సంబంధాలు ఉన్నట్లు ట్రంప్ చెప్పారు. తాను అధ్యక్షుడిగా ఎన్నిక కాకపోయి ఉంటే.. ఇప్పుడు నార్త్ కొరియాతో అమెరికా యుద్ధంలో ఉండేదని ఆయన అనడం విశేషం. ఈ భేటీకి ముందు అమెరికా రాయబారి స్టీఫెన్ బీగన్ బుధవారం ప్యాంగ్యాంగ్లో కిమ్‌ను కలవనున్నారు.