కాంగ్రెస్ పార్టీని వీడి 7న వైసీపీలో చేరుతున్నట్లు మాజీ ఎంపీపీ కోట్ల హర్షవర్థన్‌రెడ్డి స్పష్టం చేశారు. ఆయన తన కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో ఉంటే మనుగడ ఉండదని, కార్యకర్తలను కాపాడుకోడానికి వైసీపీలో చేరుతున్నానని అన్నారు. ఎలాంటి పదవులు ఆశించకుండా వైఎస్ రాజశేఖర్‌రెడ్డి మీద ఉన్న అభిమానంతో వైసీపీలో పని చేయాలని నిర్ణయించుకొన్నానని తెలిపారు. ఈ నెల 7న కోడుమూరులో ఉదయం 6గంటలకు పెద్దాయన కోట్ల విజయభాస్కర్‌రెడ్డి కాంస్య విగ్రహానికి పూల మాలలు వేసి సుమారు 100 వాహనాలతో కడపకు వెళ్తున్నామని అన్నారు. కడప సమీపంలో గ్లోబల్ ఇంజనీర్ కళాశాల ప్రాంతంలో వైఎస్ జగన్ సమక్షంలో మధ్నాహ్నం 12గంటలకు వైసీపీ కండువ కప్పుకొంటున్నట్లు తెలిపారు. సమావేశంలో ఎంపీపీ రఘునాథ్‌రెడ్డి, మాజీ ఉపసర్పంచు ప్రవీణ్, వర్కూరు మాజీ సర్పంచు ఈశ్వర్‌రెడ్డి, గోపి తదితరులు పాల్గొన్నారు.