బిపిఎస్‌సి అభ్యర్థులపై లాఠీచార్జ్‌ను ఖండించిన ఆర్‌జెడి

బిపిఎస్‌సి అభ్యర్థులపై లాఠీచార్జ్‌ను ఖండించిన ఆర్‌జెడి

పాట్నా :   బీహార్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (బిపిఎస్‌సి) అభ్యర్థులపై లాఠీచార్జ్‌కి దిగడం సరికాదని ఆర్‌జెడి అధ్యక్షుడు లాలూ ప్రసాద్‌ యాదవ్‌ గురువారం  ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు ఈవిధంగా వ్యవహరించి ఉండకూడదని, ఈ చర్య సరికాదని అన్నారు. ప్రిలిమినరీ పరీక్షను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ బిపిఎస్‌సి అభ్యర్థులు బుధవారం కమిషన్‌ కార్యాలయంపై ‘ ఘోరావ్‌’ కి దిగారు. వారిని చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జ్‌కి దిగారు. ప్రతిపక్ష ఎంపిలు, ఎమ్మెల్యేలు కూడా విద్యార్థుల నిరసనకు మద్దతు తెలపాలని పిలుపునిచ్చారు. ప్రజలంతా బీహార్‌ అధికారిక పార్టీ ఎంపిలు, ఎమ్మెల్యేల నివాసాల ఎదుట నిరసన తెలపాలని సూచించారు. ఇది రాజకీయం ఎలా అవుతుందని ప్రశ్నించారు. గత కొద్ది రోజులుగా విద్యార్థులు నిరసన తెలుపుతున్నారని, వారి డిమాండ్‌ ఒక్కటే పున: పరీక్ష నిర్వహించడమే అని అన్నారు.ప్రిలిమినరీ పరీక్షను రద్దు చేయాలని కోరుతూ డిసెంబర్‌ 18 నుండి గార్దానీబాగ్‌లోని ధర్నా స్థలంలో బిపిఎస్‌సి అభ్యర్థులు గత కొన్ని రోజులుగా నిరసన చేపడుతున్న సంగతి తెలిసిందే. స్వతంత్ర అభ్యర్థి పప్పుయాదవ్‌ కూడా బుధవారం నిరసనలో పాల్గొన్నారు.

 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos