బాలికల అక్రమ రవాణాను అడ్డుకున్న రైల్వే పోలీసులు

బాలికల అక్రమ రవాణాను అడ్డుకున్న రైల్వే పోలీసులు

అమరావతి : ఒడిస్సా నుంచి అక్రమంగా బాలికలను   రవాణా చేస్తున్న 11 మందిని విశాఖ రైల్వే పోలీసులు  కాపాడారు. శనివారం ఉదయం కిరండో నుంచి విశాఖకు వచ్చిన ఎక్స్‌ప్రెస్‌ రైలులో ఇద్దరు మేజర్లు సహా 11 మంది బాలికలను అనుమానస్పదంగా గుర్తించిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని విచారించారు. రవి అనే నిందితుడు నకిలీ ఆధార్ కార్డులు సృష్టించి బాలికలను తరలిస్తున్నట్లు గుర్తించిన పోలీసులు‌ నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ దర్యాప్తులో బాలికలను ఒడిస్సాలోని నవరంగ్‌పూర్‌ ప్రాంతానికి చెందిన చిన్నారులుగా గుర్తించారు. పూర్తిస్థాయి దర్యాప్తు కోసం విశాఖ రైల్వే పోలీసులు కేసును ఒడిస్సా పోలీసులకు అప్పగించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos