అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఢిల్లీలో ఆప్‌కు షాక్‌..!

అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఢిల్లీలో ఆప్‌కు షాక్‌..!

ఢిల్లీ : అధికార ఆమ్‌ ఆద్మీ పార్టీకి చెందిన ఇద్దరు కీలక నేతలు బల్బీర్‌ సింగ్ ‌, సుఖ్‌బీర్‌ దలాల్‌ రాజీనామా చేసి బీజేపీ లో చేరారు. ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవ , పార్టీ జనరల్‌ సెక్రెటరీ ఆశీశ్‌ సూద్ ‌, కేంద్ర మంత్రి హర్ష మల్హోత్ర సమక్షంలో ఆ ఇద్దరు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. బల్బీర్‌ సింగ్‌ ఏకంగా ఆరు పర్యాయాలు ఢిల్లీ సిక్‌ గురుద్వారా మేనేజ్‌మెంట్‌ కమిటీ సభ్యుడిగా పనిచేశారు. బీజేపీ ప్రభుత్వం తన సూచనను పరిగణలోకి తీసుకోవడం లేదని, ఢిల్లీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే స్కూళ్లలో పంజాబీ టీచర్‌లను నియమించడం లేదని ఆయన ఆరోపించారు. ఢిల్లీ సర్కారు ఏ పనీ సరిగా చేయడం లేదని సుఖ్‌బీర్‌ దలాల్‌ విమర్శించారు. ఢిల్లీలో వచ్చే ఫిబ్రవరిలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పటికే అన్ని స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. బీజేపీ కూడా త్వరలో తమ జాబితాను వెల్లడించే అవకాశం ఉంది. ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్‌ న్యూఢిల్లీ నుంచి, ముఖ్యమంత్రి అతిషి కల్కాజీ నుంచి, మంత్రులు సౌరభ్‌ భరద్వాజ్‌ గ్రేటర్‌ కైలాస్‌ నుంచి, గోపాల్‌ రాయ్‌ బాబర్‌పూర్‌ నుంచి బరిలో దిగనున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos