సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో బిగుస్తున్న ఉచ్చు

సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో బిగుస్తున్న ఉచ్చు

హైదరాబాదు:అల్లు అర్జున్ నటించిన పుష్ప-2 ప్రీమియర్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాట కేసుకు సంబంధించి సంధ్య థియేటర్ యాజమాన్యం చుట్టూ ఉచ్చు బిగుసుకుంటున్నట్టుగా ఉంది. ఈ కేసులో ఇప్పటికే సంధ్య థియేటర్ యజమానుల్లో ఒకరైన ఎం.సందీప్, సీనియర్ మేనేజర్ ఎం.నాగరాజు, లోయర్ బాల్కనీ ఇన్‌చార్జ్ గంధకం విజయ్ చందర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇదే కేసులో అరెస్ట్ అయిన నటుడు అల్లు అర్జున్ ఆ తర్వాత మధ్యంతర బెయిలుపై బయటకు వచ్చారు. తాజాగా, ఈ కేసులో మరో ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. ప్రీమియర్ షో సందర్భంగా నటీనటులు థియేటర్‌కు వస్తున్న విషయాన్ని సంధ్య థియేటర్ యాజమాన్యం పోలీసులకు వినపతిపత్రం ద్వారా తెలియజేస్తూ అనుమతి కోరింది. అయితే, పోలీసులు ఈ విజ్ఞప్తిని తిరస్కరిస్తూ థియేటర్ యాజమాన్యానికి పంపిన లేఖ ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos