బీరూట్‌పై బాంబుల వర్షం కురింపించిన ఇజ్రాయెల్‌ : 37 మంది మృతి

బీరూట్‌పై బాంబుల వర్షం కురింపించిన ఇజ్రాయెల్‌ : 37 మంది మృతి

బీరూట్‌ : లెబనాన్‌ రాజధాని బీరూట్‌పై ఇజ్రాయెల్‌ బాంబుల వర్షం కురిపించింది. గురువారం ఎంతో శక్తివంతమైన బాంబుల్ని ఇజ్రాయెల్‌ సైన్యం ప్రయోగించింది. ఇక గడచిన 24 గంటల్లో లెబనాన్‌ దేశవ్యాప్తంగా ఇజ్రాయెల్‌ సైన్యం జరిపిన దాడుల్లో 37 మంది మృతి చెందారు. 151 మందికి గాయాలయ్యాయని తాజాగా లెబనీస్‌ ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది. ఆక్రమిత వెస్ట్‌ బ్యాంక్‌లోని తుల్కరేమ్‌ శరణార్ధి శిబిరంపై గురువారం రాత్రి ఇజ్రాయెల్‌ సైన్యం చేసిన వైమానిక దాడిలో కనీసం 18 మంది పాలస్తీనియన్లు మృతి చెందారు.ఇదిలా ఉండగా.. ఇజ్రాయెల్‌ సైన్యం దాడికి స్పందనగా.. శుక్రవారం లెబనాన్‌కు చెందిన గ్రూపులు కూడా దాడికి సిద్ధపడ్డాయి.

 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos